భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్‌’ యుద్ధ విమానాలు

Second Batch Of 3 Rafale Jets Arrived at Jamnagar Air Base in Gujarat

భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో భాగంగా భారత్ చేరుకున్న 5 రఫేల్‌ విమానాలను సెప్టెంబర్ 10న దేశ వైమానిక దళంలోకి ప్రవేశ పెట్టారు. కాగా బుధవారం రాత్రి రెండో బ్యాచ్‌లో భాగంగా మరో మూడు భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ నగరం నుంచి బయల్దేరిన 3 రఫేల్ యుద్ధవిమానాలు నాన్ స్టాప్ గా ప్రయాణించి గుజరాత్ లోని జామ్‌నగర్‌ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి. రూ.59వేల కోట్లతో మొత్తం 36 రఫేల్‌ విమానాలు కొనుగోలుకు ప్రాన్స్ తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 8 రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కి చేరుకోగా, 2023 లోపు మిగతావి కూడా విడతల వారీగా చేరుకోనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 2 =