అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు

Bombay High Court Refuses Bail to Republic TV Editor-in-Chief Arnab Goswami

ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్ గోస్వామికి మరో​ ఎదురురెబ్బ తగిలింది. 2018 లో అలీబాగ్‌లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్‌ నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ ‌ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలోని ఇటీవల ముంబయి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2018 నాటి కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో గత శుక్రవారం నాడు అర్నాబ్ పిటిషన్ దాఖలు చేశారు.

అనంతరం బెయిల్‌పై శనివారం నాడు వాదనలు విన్న బాంబే హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు మరోసారి విచారించి ఈ కేసులో అర్నాబ్ కు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేస్తూ, బెయిల్ విషయంలో దిగువ కోర్టు అయిన అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అలాగే అర్నాబ్ బెయిల్‌ పిటిషన్‌పై నాలుగు రోజుల్లో అనగా శుక్రవారం లోపు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సెషన్స్‌ కోర్టును ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ