సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

national news, PM Modi, PM Modi to Address the Nation, pm narendra modi, PM Narendra Modi Address the Nation, PM Narendra Modi to Address the Nation, PM Narendra Modi to Address the Nation At 6pm, PM Narendra Modi Video Conference

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబర్ 20, మంగళవారం) సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేసి వెల్లడించారు. “ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నా తోటి పౌరులతో ఒక సందేశాన్ని పంచుకుంటాను. ఆ ప్ర‌సంగాన్ని అంద‌రూ ఆల‌కించాలి” అని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఏ అంశంపై మాట్లాడనున్నారు అనే విషయాన్ని వెల్లడించలేదు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అనేక సార్లు ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే.

గతకొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయితే రాబోయే పండుగల సీజన్, శీతాకాలం నేపథ్యంలో కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని ప్రసంగం ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 75,97,063 కు, మరణాల సంఖ్య 1,15,197 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు మూడు నెలల అనంతరం దేశంలో 50 వేల కంటే తక్కువుగా(46790) ఈ రోజు పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రసంగంలో పలు అంశాల గురించి ప్రజలకు ప్రధాని మోదీ వివరించే అవకాశమున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here