నీరు, వ్యవసాయం యొక్క విలువ తెలిసిన ప్రభుత్వం మాది – సీఎం వైఎస్ జగన్

CM YS Jagan Lays Foundation Stone to Somasila High Level Canal Phase-2 Works

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు నెల్లూరు జిల్లాలోని ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2 కు శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఫేజ్-2 పనులను సీఎం ప్రారంభించారు. ఓవైపు ఇప్పటికే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 నిర్మాణ పనులు జరుగుతుండగా, మరో రూ.460 కోట్ల వ్యయంతో ఫేజ్‌-2 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

నీరు, వ్యవసాయం యొక్క విలువ తెలిసిన ప్రభుత్వం మాది: సీఎం జగన్

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, నీరు, వ్యవసాయం, విలువ తెలిసిన ప్రభుత్వం మాది. సోమశిల ఫేజ్-2 ద్వారా ద్వారా త్రాగు, సాగు నీటి సమస్యలు తొలిగిపోనున్నాయి. ఈ రెండో దశ ప్రాజెక్టులో అవినీతికి తావులేకుండా, రివర్స్ టెండరింగ్‌ ద్వారా ఇప్పటికే 68 కోట్ల రూపాయలు ఆదా చేశాం. 2021 వ సంవత్సరంలో 6 ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యంగా పెట్టుకుని, పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే 2022 ఖరీఫ్ సీజన్‌ సమయానికి పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం” అని సీఎం వైఎస్ జగన్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =