బహ్రెయిన్‌ ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా కన్నుమూత

Bahrain Prime Minister, Bahrain Prime Minister Death News, Bahrain Prime Minister Dies, Bahrain Prime Minister Prince Khalifa bin, Bahrain’s Long-serving Prime Minister, Khalifa Bin Salman Al Khalifa Dies at 84, Long-serving Prime Minister Khalifa Bin Salman Al Khalifa, Prime Minister Khalifa Bin Salman Al Khalifa Dies

బహ్రెయిన్‌ ప్రధానమంత్రి ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు బహ్రెయిన్ అధికారిక మీడియా వెల్లడించింది. 1971 వ సంవత్సరంలో బహ్రెయిన్ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఖలీఫానే ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. మధ్యకాలంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చి ప్రజలు ఆందోళనలు చేసినప్పటికీ, అన్నింటిని అధిగమించి దాదాపుగా 50 సంవత్సరాలుగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా బాధ్యతలు వహించిన నేతగా ఖలీఫా గుర్తింపు పొందారు. ఖలీఫా మృతితో బహ్రెయిన్‌ లో వారం రోజుల పాటుగా సంతాప దినాలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ