కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

AP Govt has set up Steering Committee of 18 Members to Chalk out Distribution of Covid Vaccine

దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక సిద్ధం చేసేందుకు 18 మంది సభ్యులతో రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ స్టీరింగ్‌ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా వ్యవరించనున్నారు. ఇక కన్వీనర్‌గా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పలు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఉండనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రణాళిక రూపకల్పన కోసం ఈ స్టీరింగ్ కమిటీ నెలకొకసారి సమావేశమై చర్చించనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 19 =