ఎంపీల సస్పెన్షన్‌లో ఆల్ టైం రికార్డ్

The Political Record Of 1989 Was Broken, Political Record Of 1989 Was Broken, 1989 Political Record Was Broken, 1989 Political Record, The Political History, 1989 Record, All Time Record For Suspension Of MPs,Loksabha,Rajya Sabha, Modi, Speaker, 1989, Politcal News, Latest Political News, Mango News, Mango News Telugu
The political history, 1989 record, All time record for suspension of MPs,Loksabha,Rajya Sabha, Modi, Speaker,

మంగళవారం ఉపసభల్లో  పార్లమెంటులో భద్రతా లోపంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీని ఫలితంతో సోమవారం 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా.. మంగళవారం లోక్ సభలో మరో 49 మంది విపక్ష ఎంపీలపై వేటు పడింది. దీంతో ఇప్పటివరకు 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీనిమీద ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో మంగళవారం ఉభయ సభలు చాలా సార్లు వాయిదా పడ్డాయి. ఈ తాజా సస్పెన్షన్లతో ఇప్పటి వరకూ  ఉన్న సస్పెన్షన్ రికార్డు బద్దలయింది.  దీంతో ఎంపీల సస్పెన్షన్‌లో ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ..మరో సరికొత్త రికార్డును సృష్టించాయని.. ఏకంగా 34 ఏళ్ల అన్ బ్రేకబుల్ రికార్డును అధిగమించిందంటూ చర్చలు మొదలయ్యాయి..

పార్లమెంటులో   కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంతమంది ఎంపీలు సస్పెండ్ అవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా చర్చలు సాగాయి. డిసెంబర్ 18న  78 మంది ఎంపీలు సస్పెండ్ అవగా.. అంతకంటే ముందు డిసెంబర్ 14న 14 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో మొత్తం  92 మంది ఎంపీలు సస్పెండ్  గురయినట్లు లెక్కలు తేలాయి.  అయితే  డిసెంబర్ 19న  మరో 49 మందిని సస్పెండ్ చేయడంతో ఈ సంఖ్య 141కి చేరింది. అయితే ఇప్పుడే  34 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.  1989లో ఒకేరోజు 63 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారని.. ఇప్పుడు ఆ రికార్డును ఈ  ఎంపీల సస్పెన్షన్ బ్రేక్ చేసిందని అంటున్నారు.

యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్లలో 43 మంది ఎంపీలు  సస్పెండ్ అయ్యారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక… లోక్ సభ, రాజ్యసభ స్పీకర్లు సస్పెన్షన్లు ఎక్కువ అయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మొత్తంగా 25సార్లు.. 94మంది రాజ్యసభ సభ్యులు, 179 మంది లోక్ సభ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇలా మొత్తంగా చూస్తే ఇప్పటివరకు  233 మంది ఎంపీలు సస్పెన్సన్‌కు గురయ్యారు.

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా  ఎంపీలు సస్పెండ్ అయ్యారు.  పార్లమెంట్ భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా  డిసెంబర్ 18న  వివరణ ఇవ్వాలని.. దీనిమీద చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనడంతో..ఒకేసారి 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.అయితే 1989లో అలా ఒకేరోజు 63 మంది ఎంపీలు సస్పెండ్ అవడం అప్పట్లో సంచలనం సృష్టించగా..తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది.

రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో 1989లో ఒకేరోజు అంత మంది ఎంపీలను సస్పెండ్ చేసింది . 1989 మార్చి 15న పార్లమెంటులో మాజీ పీఎం దివంగత ఇందిరాగాంధీ హత్యపై విచారణ జరపడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఠక్కర్ కమిషన్ రిపోర్టును సమర్పించారు. అదే సమయంలో  విపక్ష పార్టీలు బోఫోర్స్ విషయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అలా అప్పుడు కూడా తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో… ఒకేసారి 63మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అయితే  లోక్ సభ ఎంపీల సస్పెన్షన్ లో ఇదే ఇప్పటి వరకూ ఆల్ టైం రికార్డ్ గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 20 =