రేపు హైదరాబాద్ నగరంలో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం

24 New Basti Dawakhanas, basti dawakhanas, Basti Dawakhanas in GHMC, Basti Dawakhanas In Telangana, Basti Dawakhanas to be Inaugurated in GHMC Area, Basti Dawakhanas to be Inaugurated Tomorrow, Basti Dawakhanas to be Inaugurated Tomorrow in GHMC Area, GHMC Area, Hyderabad new basti dawakhanas, Mango News Telugu, new basti dawakhanas

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ఏర్పాటు చేసింది. నగరంలో నిర్వహిస్తున్న ఈ 200 బస్తీ దవాఖానాలు నిరుపేదలకు, బస్తీవాసులకు మెరుగైన వైద్య పరీక్షలను అందజేస్తున్నందున మరో 24 బస్తీ దవాఖానాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.

రేపు వివిధ ప్రాంతాల్లో జరిగే బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహ్మూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మారావు, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొంటారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సంబంధిత పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులు, కార్పొరేటర్లు కూడా పాల్గొంటారని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ