కొత్త రెవెన్యూ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభం, సూచ‌న‌లు స్వీకరిస్తామన్న సీఎం కేసీఆర్‌

Discussion Starts on New Revenue Bill, New Revenue Bill, New Revenue Bill 2020, Revenue Bill, Revenue Bill 2020, telangana, Telangana Assembly, Telangana Assembly 5th Day, Telangana Assembly Revenue Bill, Telangana Assembly Session, Telangana Assembly Session today, Telangana Revenue Bill

తెలంగాణ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై చర్చ జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెవెన్యూ బిల్లుపై సభలో చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నూతన రెవెన్యూ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన రోజే అందులోని అన్ని అంశాలను సభలో వివరంగా తెలియజేశామని అన్నారు. ఈ బిల్లుపై సభ్యులంతా స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయాలని కోరారు. స‌భ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, సభ్యులంతా అభిప్రాయాలు వ్యక్తపరిచాక మరోసారి ఈ బిల్లుపై స‌భ‌కు సవివ‌రంగా వివరిస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ముందుగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ నూతన రెవెన్యూ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. వరుసగా ఎమ్మెల్యేలంతా రెవెన్యూ బిల్లుపై మాట్లాడుతున్నారు. సభలో ఈ బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చ ముగిసాక ఆమోదం తెలు‌ప‌ను‌న్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 3 =