ఇకపై ఓటీటీలు, ఆన్‌లైన్ న్యూస్ పై కేంద్రం నియంత్రణ

Digital news portals, Including Social Sites, Netflix Amazon Prime OTT platforms now under govt, Online News Media, Online News Media Including Social Sites, Online News Portals, online portals, OTT platforms, OTT Platforms Now Under Govt Regulation, OTT platforms under govt, OTT platforms under govt purview

ఆన్‌లైన్ సినిమాలు, ఆడియో-విజువల్ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు కరెంట్ ఎఫైర్స్ కార్యక్రమాలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తీసుకువస్తూ బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో ఇకపై నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లును కూడా సమాచార, ప్రసార శాఖ నియంత్రించనుంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ కంటెంట్ నియంత్రించేందుకు చట్టం లేదా స్వయంప్రతిపత్తి సంస్థ లేనందువలన కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు దేశంలో ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ న్యూస్ ఛానల్స్ ను న్యూస్‌ బ్రాడ్ ‌క్యాస్టర్స్‌ అసోసియేషన్, ప్రకటనలను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇక సినిమాలకు సంబంధించిన కంటెంట్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పర్యవేక్షణ చేస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ న్యూస్, యూట్యూబ్ చానెల్స్, ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్ పై నియంత్రణకు సంబంధించి గత నెలలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను తెలపాలని కోర్టు కోరింది. ఈ క్రమంలో డిజిటల్ మీడియా కంటెంట్ ను నియంత్రించాల్సి ఉందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోర్టుకు వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ న్యూస్‌, కంటెంట్ ప్లాట్ ఫార్మ్స్ ను ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 20 =