జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ

Telangana SEC Parthasaradhi Held Meeting with Political Parties over GHMC Elections

ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి‌ గురువారం నాడు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలు ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నేత భరత్, బీజేపీ నుంచి ఎన్‌వీఎస్ఎస్‌ ప్రభాకర్‌, చింతల రామచంద్రారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డ ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఓటర్ల తుది జాబితా ప్రచురణ అనంతరం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నోటిఫికేషన్, నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ