టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం

CM KCR, GHMC Elections, Mango News, telangana, Telangana Bhavan, Telangana CM KCR, Telangana News, Telangana Political News, Telangana Politics, TRS Parliamentary and Legislature Party, TRS Parliamentary and Legislature Party Meeting, TRS Parliamentary Meeting, TRS Party Meeting

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం నాడు టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం తీసుకోవాల్సిన చర్యలు, సమాయత్తం కావల్సిన తీరు, ప్రచార నిర్వహణ సహా పలు అంశాలపై నాయకులకు సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ