గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కూడా మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తవడంతో నామినేషన్ల దాఖలు, ప్రచారం ముమ్మరంగా సాగనుంది.
టిఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ఛార్జ్ లు:
- జీహెచ్ఎంసీ ఎన్నికల మొత్తం పక్రియ – టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- పటాన్ చెరు – మంత్రి హరీష్ రావు
- మల్కాజ్గిరి – మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి
- కుత్బుల్లాపూర్ – మంత్రి ప్రశాంత్ రెడ్డి
- ఖైరతాబాద్ – మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- సనత్ నగర్, మహేశ్వరం – మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి
- ఉప్పల్ – మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
- కూకట్ పల్లి – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- జూబ్లీహిల్స్ – మంత్రి గంగుల కమలాకర్
- ఎల్బీ నగర్ – మంత్రి జగదీష్ రెడ్డి
- రాజేంద్రనగర్ – మంత్రి మహమూద్ అలీ
- ముషీరాబాద్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ