విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. నగర పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. యువతి మెడపై తీవ్రగాయమవడంతో ఆమెను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతిపై దాడి చేసిన అనంతరం శ్రీకాంత్ తనను తానే గాయపర్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ప్రేమ విషయంలో వేధింపులు,పెళ్లికి అంగీకారం తెలపకపోవడంతోనే శ్రీకాంత్ ఈ దాడికి పాల్పడినట్లు యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గాజువాకలో యువతి హత్యోదంత ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసువడం తల్లిదండ్రుల్లో భయాందోలనలకు కారణమవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ