ఏపీ అసెంబ్లీ: వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

AP Assembly Winter Session : TDP MLAs Suspended For Third Day In A Row,AP Assembly Winter Session,TDP MLAs Suspended For Third Day In A Row,AP Assembly,TDP MLAs Suspended From Assembly,AP Assembly,AP Assembly Session 2020,AP Assembly Winter Session 2020,CM YS Jagan,YSRCP Vs TDP,AP Assembly 2020,AP Assembly Session Live,AP Assembly Today,AP Assembly Ys Jagan,Ys Jagan Assembly Live,YS Jagan Assembly Speech,AP Assembly Fights,YS Jagan Vs Chandrababu,AP Politics,Political Heat In Andhra,CM Jagan,Chandrababu,AP Assembly Latest,AP Assembly News,AP Speaker Suspends TDP MLAs

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మూడో రోజు సభలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టం బిల్లు, అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ బిల్లు, ఏపీ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ థర్డ్‌ అమైన్‌మెంట్‌ బిల్లు, యానిమల్‌ ఫీడ్‌, క్వాలిటీ కంట్రోల్‌ బిల్లు సహా 11 బిల్లులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలకంగా చర్చించారు. అయితే పోలవరం ప్రాజెక్టుపై చర్చలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగడం లేదంటూ, 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు.

దీంతో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, బెందాళం అశోక్‌‌ లను సభ నుంచి ఒకరోజు పాటుగా సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా సభ బయటకు వెళ్లారు. మరోవైపు గత రెండ్రోజుల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =