సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్‌ను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తునట్టు ఆదివారం నాడు ప్రకటించింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రూ.45 కోట్లతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించనున్నారు. సిద్ధిపేట జిల్లాకు ఐటీ టవర్ మంజూరు కావడం పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఐటీ టవర్ నిర్మాణంతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ టవర్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ