కరోనా ఎఫెక్ట్: టీజీసెట్-2021 ప్రవేశ పరీక్ష వాయిదా

Telangana Gurukul Common Entrance Test-2021 Postponed

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) వాయిదా పడింది. రేపు (మే 30, ఆదివారం) జరగాల్సిన ఈ టీజీసెట్-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టీజీసెట్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. “2021-2022 విద్యా సంవత్సరానికి గానూ సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం మే 30న జరగాల్సిన టీజీసెట్-2021 ప్రవేశ పరీక్ష కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రవేశ పరీక్షను నిర్వహించే తదుపరి తేదీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తర్వాత తెలియజేయబడుతుంది” అని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here