చట్టాలకు వ్యతిరేకంగా 16 రోజుకు చేరిన రైతుల ఆందోళన, సుప్రీంలో పిటిషన్

Farmers Protest Enters to Day 16, Bhartiya Kisan Union Approached Supreme Court Over 3 Farm Acts,Farmers Protest Enters Day 16,Farmers Protest Enters 16th Day,Farmers Protest Day 16,Central Government,Farm Laws,Farmers Protest,Farmers,Mango News,Mango News Telugu,Farmers Protest Live Updates,Central Government Proposal To Farmers,Farmers Protest Latest News,Farmers Protest Updates,Farmers Protest News,Farmers Protest Highlights,Bhartiya Kisan Union,Supreme Court,Farm Acts,Farmers Protest in Delhi Live Updates,Bharatiya Kisan Union Moves SC Against Farm Laws,Bhartiya Kisan Union Approached SC Over 3 Farm Acts

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 16వ రోజుకి చేరుకుంది. చట్టాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ఫలించక ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాలు వ్యవసాయరంగ వాణిజ్యీకరణకు మార్గాన్ని సుగమం చేస్తాయని, రైతులను కార్పొరేట్ దురాశకు గురి చేస్తాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలువురు దాఖలు చేసిన ఆరు పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, సవరణలకు సంబంధించి రైతులకు పంపిన ప్రతిపాదనలపై వారినుంచి కేంద్రానికి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. ప్రతిపాదనలను రైతులు వ్యతిరేకించినట్టు మీడియా ద్వారానే చూశామని, అయితే చర్చలకు తాము సిద్ధమేనని మంత్రి తెలిపారు. ఇక చట్టాల రద్దుపై కేంద్రం నిర్ణయం తేలకపోవడంతో ఆందోళలను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైలుపట్టాలపై ఆందోళనతో పాటుగా డిసెంబర్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ