నేటి నుంచే స్లాట్ బుకింగ్‌, డిసెంబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

Non-Agricultural Properties: Slot Booking From Dec 11th and Registrations From Dec 14th,Non-agricultural Properties,Registration Of Non-Agricultural Properties To Commence From Foday,Registration Of Non-Agricultural Properties From Dec 11th,Non-Agricultural Properties Registrations From Dec 14th,Mango News,Mango News Telugu,Chief Secretary Somesh Kumar,High Court,Telangana,Telangana High Court,Non-Agricultural,Non Agricultural,Non-Agricultural Properties Registations In Telangana,Telangana Latest News,Telangana New Registration,Dharani Portal Telangana,Non Agricultural Land Registration,Land Registrations In Telangana,Online Property Registration,Dharani Land Registration,Land Registration In Telangana

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల పక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. “100% ముందస్తు స్లాట్ బుకింగ్‌తో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి గురువారం నాడు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ నిర్ణయించిన విధంగా అవసరమైన ఫీజులు చెల్లింపు మరియు వివరాల నమోదు తరువాత ప్రజలు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు” అని సీఎస్ తెలిపారు.

“డిసెంబర్ 11, 2020 నుండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ కోసం సదుపాయం కల్పించబడుతుంది. ఇక డిసెంబర్ 14, 2020 నుండి కేటాయించిన స్లాట్ల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ల నమోదు ప్రారంభమవుతుంది. చెల్లుబాటు అయ్యే స్లాట్లు ఉన్న వ్యక్తులు మాత్రమే తమకు కేటాయించిన తేదీ మరియు సమయంలో వారి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించాలి. ముందస్తుగా స్లాట్ బుకింగ్ లేకుండా లావాదేవీలు/రిజిస్ట్రేషన్లు సాధ్యం కాదు” అని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + two =