టీఎస్‌-ఐపాస్‌తో రాష్ట్ర ప‌ర్యాట‌కశాఖ సేవ‌లు అనుసంధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Telangana Tourism Department Services Integrated With TS-IPASS,TS-IPASS For Tourism,Tourism Services Integrated With TS-IPASS,TS-IPASS To Attract More Tourism Projects In Telangana,Ts Tourism Sector In For A Boost,TS-IPASS To Attract More Tourism Projects In Telangana,Mango News,Mango News Telugu,Telangana Tourism Department,Telangana Tourism Department Services,TS-IPASS,Telangana Tourism,Telangana,Telangana Latest News,TS-IPASS For Tourism Department

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్-ఐపాస్ విధానానికి రాష్ట్ర పర్యాటక శాఖ సేవలను కూడా అనుసంధానం చేశారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎస్-ఐపాస్ వెబ్ పోర్టల్ ద్వారా పర్యాటక శాఖ సేవలను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. టీఎస్-ఐపాస్ వెబ్ సైట్ ద్వారా అనుసంధానం చేయడం వల్ల పర్యాటక శాఖలో ప్రారంభం కానున్న సింగిల్ విండో అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరం అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీ, ఈవెంట్స్ అనుమతులు, రెన్యువల్ లను త్వరితగతిన అనుమతులు పొందవచ్చని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పర్యాటకంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని అన్నారు. మలేషియా, సింగపూర్ తదితర చాలా దేశాలు పర్యాటకం మీద వచ్చే ఆదాయం పైనే అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.

“తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.హోటల్ కట్టాలంటే 15 రకాల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపై 30 రోజులలో అనుమతులు ఇవ్వనున్నాము. రెన్యువల్ కూడా ఆటోమాటిక్ గా జరుగుతుంది. అనుమతి ఇవ్వని పక్షంలో 30 రోజుల తర్వాత డీమ్డ్ అప్రూవల్ వస్తుంది. భవిష్యత్లో తెలంగాణలో టూరిజం మంచి అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ కు ఘనమైన చరిత్ర ఉంది. రామప్ప లాంటివి వరల్డ్ టూరిజం మ్యాప్ లోకి త్వరలోనే చేరుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు డ్యామ్ల వద్ద పర్యాటకం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాం” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు చాలా సులభం అయ్యాయన్నారు. డీమ్డ్ అప్రూవల్ ఉంటుందని, గత ఆరు సంవత్సరాల్లో చాలా కంపెనీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈ విధానం ద్వారా పరిశ్రమలలో పెట్టుబడులు వచ్చినట్లు పర్యాటక శాఖలో కూడా పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్రానికి పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి చాలా సామర్థ్యం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, టిఎస్ టిడిసి ఈడీ శంకర్ రెడ్డి, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఈవెంట్స్ మేనేజర్లు, టూరిజం అధికారులు మహేష్, ఓం ప్రకాష్, శశిధర్ లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =