తెలంగాణ ఎన్నికలతో మరింత పెరిగిన ధీమా

Will Congress be a game changer in AP,Will Congress a game changer,game changer in AP,game changer,Congress ,BJP , YCP ,Will Congress be a game changer in AP, Telangana elections, AP elections,Mango News,Mango News Telugu,AP elections Latest News,AP elections Latest Updates,AP elections Live News,Congress Latest News,Congress Latest Updates
Congress ,BJP , YCP ,Will Congress be a game changer in AP?, Telangana elections, AP elections

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నవరకూ.. కాంగ్రెస్‌ను ప్రజలు అంతగా ఆదరిస్తారన్న విషయం సొంతపార్టీ నేతలూ కూడా అంచనా వేయలేకపోయారు. మొత్తానికి తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకున్న రెండో అధికార పార్టీగా జెండా పాతాక.. ఇదే ధీమాతో ఏపీలోనూ దూసుకుపోవాలని సిద్దం అవుతుంది.

తన స్వయంకృతాపరాధంతో తెలుగు రాష్ట్రాలలో పార్టీని చంపేసుకున్న కాంగ్రెస్.. ఇక పూర్తిగా ఇక్కడ రాజకీయాల నుంచి అంతర్దానం అయిపోతుందనే భావించారు.కానీ  క్రమంగా తన గ్రాఫ్ పెంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఒకపక్క  తెలంగాణను, మరోపక్క  కర్ణాటకను కూడా హస్త తం చేసుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చూపు ఆంధ్ర ప్రదేశ్ పైన పడింది. .

కానీ తెలంగాణలో జరిగినట్లు ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంతగా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో లేవన్న సంగతి అందరికీ తెలుసు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ,జనసేన కూటమిగా  ఉంది.  కాకపోతే ఈ మూడు పార్టీల కాంబినేషన‌ను  కాంగ్రెస్ త్రిముఖ పోటీగా మారుస్తుందన్న అంచనాలు ప్రస్తుతం పెరుగుతున్నాయి.

ఎందుకంటే ఆర్కే రాజీనామా చేశాక మిగిలిన  150 మంది ఎమ్మెల్యేలలో.. దాదాపు 60 నుంచి 70% సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ అధినేత జగన్ మార్యేస్తార ప్రచారం జోరుగా జరుగుతోంది. అలా బయటకు వచ్చిన అసంతృప్తులకు టీడీపీ, జనసేన  పొత్తు వల్ల టికెట్లను కేటాయించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఏపీలో కనిపిస్తుంది. బీజేపీ ఏపీలో పుంజుకున్న దాఖలాలు లేకపోవడంతో.. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అందుపుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఏపీలో కీలకమైన నేతలందరినీ కలుపుకొని కాస్త గట్టిగా ప్రయత్నిస్తే.. కనీసం 10 నుంచి 15 ఎమ్మెల్యేలను గెలుచుకున్నా కూడా కాంగ్రెస్  పార్టీ గేమ్ చేంజర్ గా మారటానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే  ఏపీ ఈ సారి ముక్కోణపు పోటీల్లో అతి తక్కువ సీట్లతోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలను గనక కాంగ్రెస్ గెలుచుకుంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో చక్రం తిప్పడానికి హస్తం పార్టీకి అవకాశం ఉంటుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =