అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ బుధవారం నాడు సమావేశమైంది. కాగా బైడెన్ ఎన్నిక పక్రియను వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనం(పార్లమెంటు)లోకి దూసుకొచ్చారు. యూఎస్ కాంగ్రెస్ సమావేశాన్ని అడ్డుకుని, కిటికీలు, ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులు మధ్య ఘర్షణ నేపథ్యంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఆందోళనలో ఓ మహిళ సహా నలుగురు మరణించినట్టు తెలుస్తుంది. అలాగే 50 కి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. హింసను అదుపులోకి తెచ్చేందుకు అమెరికా కేంద్ర బలగాలు రంగంలోకి దిగగా, వాషింగ్టన్ పరిధిలో పూర్తిగా కర్ఫ్యూ విధించారు. తీవ్ర ఘర్షణ వాతావరణం సద్దుమణిగాక జో బైడెన్ గెలుపు ధ్రువీకరణ ప్రక్రియ కోసం యూఎస్ కాంగ్రెస్ మళ్ళీ సమావేశమై చర్చిస్తుంది. అయితే ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనం ఎదుట తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు అధ్యక్షుడు ట్రంప్ అకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లుగా ప్రకటించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ