మెట్రో రైళ్లలో ప్రయాణం: కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల వివరాలు ఇవే

GoI Issues Guidelines For Metro Services Resuming, guidelines for metro service resumption, Guidelines For Metro Services, Metro Services, Metro Services In Delhi, Metro Services In Kolkata, Metro Services In Telangana, Metro Services Resuming

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రో రైలు సంస్థలు, ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాలును కేంద్రప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది.

మెట్రో రైలు ప్రయాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలు:

  • కంటైన్‌మెంట్‌ జోన్ల వద్ద ఉన్న మెట్రో స్టేషన్లను మూసి వేయాలి.
  • ప్రయాణీకులు, సిబ్బంది సహా అందరూ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.
  • సామాజిక దూరాన్ని పాటించేలా స్టేషన్లలో మరియు రైళ్ల లోపల తగిన గుర్తులు ఏర్పాటు చేయాలి.
  • స్టేషన్లలో మరియు రైళ్లలో ప్రయాణీకుల రద్దీని నివారించడానికి రైళ్ల నడిపే సమయాలను క్రమబద్దీకరించాలి.
  • స్టేషన్లలోకి ప్రవేశించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే ప్రయాణించడానికి అనుమతించాలి.
  • ప్రయాణీకుల కోసం స్టేషన్లలోకి ప్రవేశించేటప్పుడు అన్ని చోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
  • ప్రయాణికులు అందరూ ఆరోగ్య సేతు యాప్ వాడేలా ప్రోత్సహించాలి.
  • ప్రయాణికులు తక్కువ లగేజీతో రావాలని సూచన.
  • స్మార్ట్ కార్డ్ మరియు నగదు రహిత/ఆన్‌లైన్ లావాదేవీల వాడకాన్ని ప్రోత్సహించాలి. టోకెన్లు, పేపర్ స్లిప్స్/టికెట్ లను సరైన విధంగా శానిటైజేషన్ చేశాకనే వాడాలి.
  • ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించేలా, రద్దీతో కాకుండా సాధారణంగా రైళ్లలోకి వెళ్లేలా స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేయాలి.
  • రైళ్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో స్వచ్ఛమైన గాలి ఉండేలా సాధ్యమైనంతగా చర్యలు తీసుకోవాలి.
  • మెట్రో రైలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్థానిక పోలీస్ సహా అధికారిక సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి.
  • మెట్రో ప్రయాణికుల అవగాహన కోసం స్టేషన్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =