కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26 న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎర్రకోటను జనవరి 31 వరకు మూసివేస్తున్నామని, అప్పటివరకు సందర్శకులకు అనుమతి ఉండదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మూసివేతకు గల కారణాలను మాత్రం ఉత్తర్వుల్లో వెల్లడించలేదు.
ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా కొందరు నిరసనకారుల దాడిలో ఎర్రకోట ప్రాంగణంలో టికెట్ కౌంటర్, మెటల్ డిటెక్టర్ గేట్ సహా కొన్ని ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఎర్రకోటను సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. జరిగిన నష్టంపై పూర్తీ వివరాలతో నివేదిక అందజేయాలని ఏఎస్‌ఐని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ