ఇప్పటికే 22,533 వెంటిలేటర్లు, 3 కోట్లకు పైగా ఎన్-95 మాస్కులు పంపిణీ

3Cr N95 masks, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic, Govt distributes over 3 Cr N95 masks, India reaches landmark of distributing more than 3 crore N95, Union Govt Distributed More than 3 cr N95 Masks

దేశంలో కోవిడ్-19 నియంత్రణ కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కోవిడ్-19 సదుపాయాలను పెంచడంతో పాటుగా, వారి ప్రయత్నాలకు అనుబంధంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం వైద్య సామాగ్రిని ఉచితంగా అందిస్తోంది. మార్చి 11, 2020 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 3.04 కోట్లకు పైగా ఎన్-95 మాస్కులను, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లను రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేసింది. వీటితో పాటుగా 10.83 కోట్లకు పైగా హైడ్రోక్లోరోక్విన్ (హెచ్.‌సి.క్యూ.) టాబ్లెట్స్ ను కూడా వారికి పంపిణీ చేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 22,533 మేక్ ఇన్ ఇండియా వెంటిలేటర్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని, వాటిని ఆయా ప్రాంతాల్లో నెలకొల్పి, పనిచేసే విధంగా చూసే బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం వహిస్తోందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 17 =