త్వరలోనే నిరుద్యోగభృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయవచ్చు : మంత్రి కేటీఆర్

KTR, KTR About Unemployment Allowance, KTR Says CM KCR will Announce about Unemployment Allowance, KTR Says CM KCR will Announce about Unemployment Allowance Soon, Mango News, Minister KTR, Unemployment Allowance, Unemployment allowance in India, Unemployment allowance in Telangana, Unemployment Allowance Scheme, Unemployment Allowance Scheme News, Unemployment Allowance Scheme Updates

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రేపో మాపో సీఎం కేసీఆర్ నిరుద్యోగభృతిపై ప్రకటన చేయవచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక టీఎస్ పీఎస్సి సహా పలు ప్రభుత్వ సంస్థల ద్వారా ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రకటించారు. అలాగే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు, విద్యా, వైద్యం సహా పలు రంగాల్లో మరియు సంక్షేమ పథకాల ద్వారా సాధించిన ప్రగతిని మంత్రి కేటీఆర్ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =