మళ్ళీ సిలిండర్‌ ధరలు పెరుగుదల, ఇవాళ నుంచే అమల్లోకి కొత్త ధరలు

Subsidised Cooking Gas Cylinder Price Increases By Rs 25 From Today

దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు డొమెస్టిక్ సబ్సిడీ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సబ్సిడీ సిలిండర్‌పై 25 రూపాయలు పెంచారు. మరోవైపు సబ్సిడీయేతర కమర్షియల్(వాణిజ్య) 19 కేజీల సిలిండర్లపై ఫిబ్రవరి 1న రూ.190 పెంచిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అందులో రూ.6 తగ్గించి రూ.184 పెంపుగా నిర్ణయించారు. ఈ సవరించిన ధరలు అన్ని మెట్రో నగరాల్లో ఫిబ్రవరి 4, గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి.

తాజా పెంపుతో సబ్సిడీ ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ.719, ముంబయిలో రూ.719, చెన్నైలో రూ.735, కోల్‌కతాలో రూ.745.50, హైదరాబాద్ లో రూ.771.50, బెంగళూరులో రూ.722 కు పెరిగాయి. గత డిసెంబర్ లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలను 50 రూపాయలు చొప్పున రెండు సార్లు పెంచారు. కాగా 2021 లో తొలిసారిగా 25 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ