బీరు రుచిపై వాతావరణ మార్పులు..తాజా పరిశోధనలు ఏం చెప్పాయి?

Climate change on the taste of beer what does the latest research say,Climate change on the taste of beer,what does the latest research say,taste of beer,Mango News,Mango News Telugu,beer, bitter taste to beer, climate change, flower in Europe,Attention Beer Lovers, Climate change could soon affect, Hop flowers, journal Nature Communications,Climate change on beer Latest News,Climate change on beer Latest Update
beer, climate change,journal Nature Communications, flower in Europe, Hop flowers, bitter taste to beer.

వాతావరణంలో జరుగుతోన్న మార్పులు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు మనుష్యుల ఆరోగ్యాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే తాజాగా వాతావరణ మార్పులతో  బీరు రుచి, నాణ్యతలో కూడా మార్పులు వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో  ప్రచురించారు. నిజానికి వాతావరణ మార్పులతో యూరప్‌లో పండే హోప్‌ అనే  ఒక రకమైన పూలు.. నాణ్యత, దిగుబడి తగ్గుతోందని  చెబుతున్నారు. హోప్ పూలను బీరుకు ఒక రకమైన చేదు రుచిని అందించడానికి  ఉపయోగిస్తారు.

వాతావరణంలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పులతో..వేడి, ఎక్కువ కాలం పొడి వాతావారణం ఏర్పడుతున్నాయి. దీనివల్ల పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇప్పుడు హోప్ పూలలో వస్తున్న మార్పులతో రానున్న రోజుల్లో బీరు ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. యూరోపియన్‌ ప్రాంతాల్లో  2050 నాటికి  హోప్‌ పూల దిగుబడి 4- 18 శాతం తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా రైతులు తమ వ్యవసాయ పద్ధతులను ఇప్పటినుంచే సర్దుబాటు చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరోవైపు ఇప్పుడిప్పుడే రైతులు ఈ హోప్‌ పూల దిగుబడిని పెంచడానికి కృషి చేస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో హోప్‌ను పండించడానికి, దీనికోసం ప్రత్యేక నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

బీరు తయారీలో నీళ్లు,ఈస్ట్‌, మాల్ట్‌తో పాటు ఉపయోగించే మరో పదార్థం.. ఈ హోప్‌ పూలు. పరిశోధనలు చెబుతున్నదాని ప్రకారం.. ఇప్పుడు హోప్‌ పెరుగుతోన్న ప్రాంతాల్లో దాదాపు 20 శాతం తగ్గినట్లు కనిపించింది. చెక్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌‌తో పాటు.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వాతావరణంలో మార్పుల వల్లే హోప్‌ దిగుబడి తగ్గుతుందని..భవిష్యత్తులో మరింత తగ్గుతుందని చెబుతున్నారు. ఇలా హోప్‌ దిగుబడి తగ్గడంతో రాబోయే రోజుల్లో బీరు ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

నిజానికి కోవిడ్ 19  తర్వాత బీరు ధరలు దాదాపు 13 శాతం పెరిగాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల హోప్‌లోని ఆల్ఫా బిట్టర్‌ యాసిడ్స్‌ తగ్గిపోవడానికి దారి తీశాయని, ఇది బీరు రుచి మారడానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణంలో జరుగుతోన్న ఈ  మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మనుషులు చేస్తున్న పనులతో.. గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఉష్ణోగ్రతలను పెంచుతూనే ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 15 =