రేపే ఇంగ్లాండ్ తో భారత్ తోలి టెస్ట్ ప్రారంభం, ఆసక్తికరంగా ఇరుజట్ల పోరు

First Test Starts from Tomorrow at Chennai, India vs England, India vs England 1st Test Live Score, India vs England Cricket Score, India vs England First Test, India vs England Live, India vs England Live Score, India vs England Live Score 1st Test, India vs England Match, India vs England Match News, India vs England Match updates, India vs England Test Live Cricket Score, Mango News

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ రేపు (ఫిబ్రవరి 5, శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా సిరీస్ లో ఘనవిజయం సాధించి ఊపు మీదున్న భారత్ జట్టు స్వదేశంలో కూడా ఇంగ్లాండ్ పై సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ లో భారత్ ఫైనల్ చేరేందుకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది. ఇంగ్లాండ్ ‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా ఆటగాళ్లంతా గురువారం నాడు చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు.

మరోవైపు తొలిటెస్టుకు ముందు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా సిరీస్ లో కీలకంగా రాణించిన రిషబ్ పంత్ నే ఇంగ్లాండ్‌ తో తొలి టెస్టులో వికెట్‌ కీపర్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపాడు. అలాగే వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. ఒకరి కంపెనీని మరొకరు, కలిసి బ్యాటింగ్ చేయడాన్ని కూడా ఆనందిస్తామని చెప్పాడు. మైదానం బయట కూడా రహానేతో సన్నిహితంగానే ఉంటానని కోహ్లీ తెలిపాడు.

ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలిసారిగా స్వదేశంలో టెస్టులు ఆడనున్నాడని, అతను కీలకం కానున్నాడని అన్నాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ మరియు ఇషాంత్ శర్మ కూడా బౌలింగ్ యూనిట్ లో అందుబాటులో ఆనందంగా ఉందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇక ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత జట్టు 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ పూర్తి సిరీస్‌ను చెన్నై, అహ్మదాబాద్, పూణే వేదిక‌ల్లో మాత్ర‌మే నిర్వ‌హించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =