తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రూ.12,110 కోట్లతో రాష్ట్రంలో రైతుల రుణాలు మాపీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సహకార బ్యాంకుల వ్యవసాయ రుణాలు తీసుకున్న దాదాపు 16.43లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. నివర్, బురేవి తుఫాన్ల కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
తమిళనాడులో వ్యవసాయాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి రుణమాఫీ సహాయపడనుందని, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడమే తన ప్రధాన కర్తవ్యమని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రుణమాపీ పథకం వెంటనే అమలులోకి వస్తుందని, ఇందుకోసం అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూర్చనుందని సీఎం పళనిస్వామి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ


































