‘ఆపరేషన్ గంగా’ : దాదాపు 10,800 మంది భారతీయులను దేశానికి తిరిగి తీసుకువచ్చిన కేంద్రం

Operation Ganga About 10800 Indian Nationals Brought Back By Special Flights From Ukraine So Far, Operation Ganga About 10800 Indian Nationals Brought Back By Special Flights From Ukraine, 10800 Indian Nationals Brought Back By Special Flights From Ukraine, Special Flights From Ukraine, Operation Ganga, 10800 Indian Nationals, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాలైన రొమేనియా, హంగరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్‌ లకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ఇప్పటికి ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 10,800 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావడంలో భాగంగా ‘ఆపరేషన్ గంగా’ కింద ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి 14 పౌర విమానాలు మరియు 3 C-17 ఐఏఎఫ్ విమానాలతో సహా 17 ప్రత్యేక విమానాలు శుక్రవారం దేశానికి తిరిగి వచ్చాయని తెలిపారు. మరో పౌర విమానం కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉందన్నారు. పౌర విమానాలు ద్వారా 3142 మందిని తీసుకురాగా, C-17 విమానాలు 630 మంది ప్రయాణికులను తరలించాయని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 43 ప్రత్యేక పౌర విమానాల ద్వారా 9364 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించగా, C-17కి చెందిన 7 విమానాలు ఇప్పటివరకు 1428 మంది ప్రయాణికులను తరలించాయని, అలాగే 9.7 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ని ఉక్రెయిన్ కు తీసుకెళ్లాయని చెప్పారు. నేడు దేశానికి వచ్చిన పౌర విమానాలలో బుకారెస్ట్ నుండి 4, కోసిస్ నుండి 2, బుడాపెస్ట్ నుండి 4, ర్జెస్జో నుండి 3 మరియు సుసెవా నుండి 2 వచ్చాయన్నారు. అయితే ఐఏఎఫ్ C-17 విమానాలు బుకారెస్ట్ నుండి 2 మరియు బుడాపెస్ట్ నుండి 1 ఒకటి వచ్చాయని తెలిపారు.

మరోవైపు రేపు 11 ప్రత్యేక పౌర విమానాలు 2200 కంటే ఎక్కువ మంది భారతీయులను దేశానికి తిరిగి తీసుకువస్తాయని భావిస్తున్నారు.10 విమానాలను న్యూఢిల్లీలో మరియు ఒకటి ముంబయిలో ల్యాండింగ్ చేయనున్నారు. వీటిలో 5 విమానాలు బుడాపెస్ట్ నుండి, 2 ర్జెస్జో నుండి మరియు 4 సుసెవా నుండి బయలుదేరనున్నాయి. ఇక నాలుగు C-17 విమానాలు రోమానియా, పోలాండ్ మరియు స్లోవేకియాలకు వాయుమార్గాన ఉన్నయని, ఇవి రాత్రికి మరియు రేపు తెల్లవారుజామున చేరుకోవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =