సలార్ పార్ట్‌-2 కంటే ముందే ‘కేజీఎఫ్ 3’..

Director Prashanth Neel Plans To Begin KGF Chapter 3 Shoot Before Prabhas Salaar 2 Movie,Director Prashanth Neel Plans To Begin KGF 3,KGF Chapter 3 Shoot,Before Prabhas Salaar 2 Movie,Prashanth Neel Plans To Begin KGF Chapter 3,Mango News,Mango News Telugu,Prashant Neil Masterplan,KGF 3 before Salaar Part 2, Prashant Neil,KGF 3, Salaar Part 2,Director Prashanth Neel Latest News,Director Prashanth Neel Latest Updates,KGF Chapter 3 Latest News,KGF Chapter 3 Latest Updates

కేజీఎఫ్‌ సిరీస్‌తో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్‌ని అందుకుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్-1 విడుదల కానుంది. అయితే సలార్ పార్ట్-2 షూటింగ్ కూడా పూర్తి చేశాక ఇతర హీరోలతో ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. నిజానికి ‘సలార్’ తర్వాత ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇప్పుడు కేజీఎఫ్‌ చాప్టర్ 3 ఎప్పుడు అంటూ..? అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇటీవల ‘కేజీఎఫ్ 2’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ అధినేతలతో ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’చాప్టర్ 3 ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ‘కేజీఎఫ్-3కి సంబంధించి సాలిడ్ అప్డేట్ అందింది. ‘సలార్ 2’ షూటింగ్‌కి ముందే ప్రశాంత్‌నీల్ కేజీఎఫ్-3 పనులను ప్రారంభిస్తారని, త్వరలోనే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సలార్ పార్ట్-1 చిత్రీకరణను ముగించిన తర్వాత కేజీఎఫ్-3పై దృష్టి సారించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.

ఇక ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ యూనివర్స్ గురించి తెలిసిందే కదా. ఇండియన్ సినీ ప్రపంచంలో అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ‘సలార్’ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి పెంచేసింది. ‘కేజిఎఫ్’-‘సలార్’ క్రాస్ ఓవర్ కంటెంట్‌తో భారీ యూనివర్స్‌ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేయబోతున్నాడని తెలియడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ సన్నిహిత వర్గాల వివరాల ప్రకారం.. త్వరలోనే ఆయన ‘కేజీఎఫ్’ చాప్టర్ 3 పనులను ప్రారంభిస్తారట. ‘సలార్ 2’ షూటింగ్ ప్రారంభించే ముందే ‘కేజీఎఫ్ 3’ని సెట్స్ పైకి తీసుకెళ్తారని తెలిసింది. ‘కేజీఎఫ్’ యూనివర్స్ తర్వాత ‘సలార్’ యూనివర్స్ ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఇక ‘కేజీఎఫ్-1’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల్లో నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 3 లోను నటించనున్నారు. అలాగే యశ్‌తో పాటు ఇందులో ప్రభాస్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘సలార్’ సినిమా విషయానికొస్తే.. మైనింగ్ మాఫియా, ఆర్మీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్‌గా కనిపించనున్నారు. రావు రమేష్, శ్రీయా రెడ్డి, టీను ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here