తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Wishes Pour in to Greet Telangana CM KCR on his Birthday

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, చక్కటి ఆరోగ్యంతో చల్లగా ఉండాలని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు జాతీయ రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు “కోటి వృక్షార్చన” ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంతో పాటుగా, రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులు, ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. “నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు ఇలాగే కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని సీఎం కేసీఆర్ అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ