వైఎస్‌ వివేకా హత్య కేసులో.. ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు ఇవ్వాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Telangana High Court Orders CBI To Issue Notices For T Gangireddy in Ex Minister YS Viveka Assassination Case,Telangana High Court Orders CBI,CBI To Issue Notices For T Gangireddy,T Gangireddy in Ex Minister YS Viveka Assassination Case,Telangana High Court Issue Notices For T Gangireddy,Mango News,Mango News Telugu,Telangana HC notice to Gangi in Viveka Reddy murder,Ex-MP murder case,Viveka murder case,Investigation Will be Completed by April 15,Vivekananda Reddy murder,Supreme Court of India,YS Vivekananda Reddy Case Latest News,YS Vivekananda Reddy Latest Updates,YS Vivekananda Reddy Live News

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్‌ తుమ్మలపల్లి గంగిరెడ్డికి వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశించింది. కాగా గతంలో గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు నాగేంద్రన్‌, జగదీశ్‌లు.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడంతో గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ ఏపీ హైకోర్టు నుంచి ఇక్కడకు బదిలీ అయిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇది మొదటిసారి మార్చి 23న విచారణకు వచ్చిందని, అయితే కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ గంగిరెడ్డి తరఫున ఎవరూ హాజరుకాలేదని తెలిపారు.

కాగా ఈ నేపథ్యంలో.. హత్యకు గురైంది తన తండ్రి అని, తాము అసలైన బాధితులమని, తమ వాదనలు కూడా వినాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి చేసిన అభ్యర్ధనను ఆమె తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. తన క్లయింట్ వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారి వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఎర్ర గంగిరెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులను వ్యక్తిగతంగా ఆయనకు అందజేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే గంగిరెడ్డి కోర్టుకు హాజరైన తర్వాత సునీతా రెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపిన జస్టిస్‌ సుమలత, అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 12కు వాయిదా వేశారు. ఇక వైఎస్‌ వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తర్వాత 90 రోజులు గడచినా చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్‌ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్‌ బెయిల్‌ వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + seven =