మహారాష్ట్రలో ఒక స్కూల్ హాస్టల్‌లో 190 మందికి కరోనా పాజిటివ్

190 Students and Teachers Tested Positive for Covid-19 in School Hostel in Maharashtra

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వషిమ్‌ జిల్లాలో ఓ పాఠశాల హాస్టల్ లో మొత్తం 190 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 186 మంది విద్యార్థులు కాగా, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో ఆ పాఠశాల ప్రాంగణాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారించబడిన విద్యార్థుల్లో ఎక్కువ మంది అమరావతి మరియు యావత్మల్‌ కు జిల్లాలకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు జిల్లాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు కూడా విధించింది.

మరోవైపు కొన్నిరోజుల క్రితం లాతూర్ జిల్లాలోని ఓ హాస్టల్ ‌లో కూడా 39 మంది విద్యార్థులు మరియు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,21,119 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 20,08,623 మంది కరోనా నుంచి కోలుకోగా, 51,937 మంది మరణించారు. ప్రస్తుతం 59,358 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ