కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ ‌షా తిరుపతి పర్యటన రద్దు

amit shah, Amit Shah Tirupati Tour, Amit Shah Tirupati Tour Cancelled, Amit Shah Tirupati Visit, Mango News, Tirumala Tirupati, Tirumala Tirupati Devasthanam, Union Minister Amit Shah, Union Minister Amit Shah Tirupati Tour, Union Minister Amit Shah Tirupati Tour Cancelled

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ముందుగా మార్చి 4 వ తేదీన అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ 29 వ సమావేశం జరగనునట్టు తెలిపారు. ఈ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. అలాగే మార్చి 5 న తిరుపతిలో అమిత్ షా పర్యటనలో భాగంగా బీజేపీ-జనసేన మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తిరుపతి పర్యటన అకస్మాత్తుగా రద్దు అయింది. ఈ పర్యటన రద్దుకు గల కారణాలు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ముఖ్యమంత్రుల సమావేశం కూడా రద్దు‌ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశ నిర్వహణ తదుపరి తేదీని తర్వాత ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ