ఆ రాష్ట్రంలో పిటీషన్ల వెల్లువ

Prisoners Who Want To Cash The Election A Flood Of Petitions In Odisha State, Prisoners Who Want To Cash, Election A Flood Of Petitions In Odisha State, Flood Of Petitions In Odisha, May 13 And June 1, The Assembly Elections, Odisha, Flood, The Parliamentary Elections, Prisoners, Petitions, Odisha State, Mango News, Mango News Telugu
May 13 and June 1, the assembly elections, Odisha , the parliamentary elections, Prisoners , petitions ,Odisha state

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో నేతల ప్రచారాలు, హెర్డింగ్స్, బోర్డింగ్స్‌తో దేశంలోని అన్ని ప్రాంతాలు కోలాహలంగా మారుతున్నాయి. అన్ని పార్టీల నేతలు తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకు పడుతూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికలలో తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి హస్తినలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మరికొన్ని పార్టీలు రాష్ట్రంలో జరిగే జమిలీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పావులు కదుపుతున్నాయి. ఇలా ఎవరికి వారు హామీల వర్షం కురిపిస్తూ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇలా నేతలు, ఓటర్లు ఎవరి బిజీలో వారుంటే ఈ ఎన్నికల హడావిడిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి జైల్లో ఉన్న ఖైదీలు భావిస్తున్నారట.

మే 13 నుంచి జూన్ 1 మధ్య అటు ఒడిశాలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒడిశాలో త్వరలో రానున్న ఎన్నికల కోసం కోర్టులో భారీగా బెయిల్ పిటిషన్లు దాఖలు అవుతున్నాయట. తమ ప్రాంతంలో ఓటు వేయడానికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు అర్జీలు పెడుతున్నారట. ఇప్పటికవరకూ ఎన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ఎవరికైనా బెయిల్ వచ్చిందా అనే విషయం బయటకు తెలియకపోయినా.. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బెయిల్ దరఖాస్తులు రావడం మాత్రం ఇదే తొలిసారంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 5 =