భారత మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ కు కరోనా పాజిటివ్‌

COVID-19, Former Cricketer Yusuf Pathan Tested Positive, Mango News, Mango News Teugu, Team India Former Cricketer Yusuf Pathan, Team India Former Cricketer Yusuf Pathan Tested Positive, Team India Former Cricketer Yusuf Pathan Tested Positive for Covid-19, Yusuf Pathan, Yusuf Pathan Coronavirus News, Yusuf Pathan Covid 19, Yusuf Pathan Tested Positive, Yusuf Pathan Tested Positive for Covid-19

దేశంలో ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివ్ గా తేలాక ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు, చికిత్సను తీసుకుంటున్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారిని త్వరగా కరోనా పరీక్ష చేయించుకోమని అభ్యర్దిస్తున్నాను” అని యూసఫ్‌ పఠాన్‌ ట్వీట్ చేశారు. మరోవైపు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్ ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ