మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ‌

CM Shivraj Singh Choujan Tests Covid-19 Positive, Madhya Pradesh CM, Madhya Pradesh CM Coronavirus, Madhya Pradesh CM Shivraj Singh Choujan, Madhya Pradesh CM Shivraj Singh Choujan Tests Covid-19 Positive, Madhya Pradesh Coronavirus, Madhya Pradesh Coronavirus News

దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత రెండు రోజులుగా సీఎంకు అస్వస్థతగా ఉండడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలినట్టు శనివారం నాడు ప్రకటించారు. దేశంలో ఒక సీఎంకు కరోనా పాజిటివ్ గా తేలడం ఇదే తొలి సారి.

“నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి. పరీక్ష రిపోర్ట్ లో పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా నాతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులను కరోనా పరీక్షలు చేయించుకోమని కోరుతున్నాను. ఆలాగే సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ లో ఉండాలని” కోరుతున్నానని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్ ట్వీట్ చేశారు. భోపాల్‌లోని ఓ ఆసుపత్రిలో సీఎం చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మార్చి 25 నుండి ప్రతి సాయంత్రం రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితులను సమీక్షిస్తున్నానని సీఎం చౌహన్ చెప్పారు. ఇప్పుడు కూడా వీలైనంతవరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరిస్థితిని సమీక్షించడానికి ప్రయత్నిస్తానని, ఒకవేళ కుదరకుంటే హోంమంత్రి నరోత్తం మిశ్రా, పట్టణాభివృద్ధి, పరిపాలన మంత్రి భూపేంద్ర సింగ్, వైద్య విద్య మంత్రి విశ్వస్ సారంగ్, ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి చేత కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =