మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. శనివారం కూడా కొత్తగా 67,123 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 37,70,707 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 419 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 59,970 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 56,783 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 30,61,174 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,47,933 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (ఏప్రిల్ 17, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 2,35,80,913
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 37,70,707
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 30,61,174
- కరోనా రికవరీ రేటు – 81.18%
- యాక్టీవ్ కేసులు – 6,47,933
- ఏప్రిల్ 17 న నమోదైన కేసులు – 67,123
- ఏప్రిల్ 17 న డిశ్చార్జ్ అయినవారు – 56,783
- ఏప్రిల్ 17 న నమోదైన మరణాలు – 419
- మొత్తం మరణాల సంఖ్య – 59,970
- కరోనా మరణాలు రేటు – 1.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ