రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3 లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుంది. దేశంలోని దాదాపు 20రాష్ట్రాలు, 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయి. ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్ ను మరింత వ్యాప్తి చేయటమే. లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించటం అసాధ్యం. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుంది. మీకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరాను. ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను ఈ లేఖకు జత చేసి పంపాను” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారికి లేఖ రాసాను. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుంది.(1/3)#CancelAPboardExams2021 pic.twitter.com/B2W9OE1d2p
— Lokesh Nara (@naralokesh) April 26, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































