మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 16, ఆదివారం కూడా 34,389 కరోనా కేసులు, 974 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,78,452 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 81,486 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 59,318 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 48,26,371 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 89.74 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.52 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 4,68,109 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 3,11,03,991 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ