తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్ కో

Minister KTR Thanked Green Co Company for Hand over 200 Oxygen Concentrators to the State,Mango News,Mango News Telugu,COVID-19,Telangana Receives 200 Oxygen Concentrators From China Based Company,Covid-19 Updates,Covid-19 In Telangana,Telangana Receives 200 Oxygen Concentrators,Telangana Ahead In Treating Covid Patients,KTR,KTR Thanks Centre For Increasing Supplies Of Oxygen,200 Oxygen Concentrators Arrive In Hyderabad From China,Greenko Donates 200 Oxygen Concentrators To Telangana,Minister KTR Thanked Green Co Company,Green Co Company,Minister KTR,Minister KTR Live Updates,Minister KTR Latest News,Telangana Minister KTR,Oxygen,Oxygen Concentrators,Greenko Company Donates 200 Oxygen Concentrators To Telangana

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించినందుకు గ్రీన్ కో సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి అన్నారు. అయితే ఇప్పుడు ఎంతో అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సంట్రేటర్లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =