మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా విద్యార్ధులను తీర్చిదిద్ది, ప్రజా ప్రతినిధిగా విశాఖ నగర అభివృద్ధికి ప్రశంసనీయమైన సేవలు అందించిన కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమితులు కావడం సంతోషకరమైన విషయం. హరిబాబుకు నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ రంగాలపై దృష్టిపెట్టారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతో దోహదపడుతుందనే విశ్వాసం ఉంది. హరియాణా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకు నా తరఫున, జనసేన తరఫున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న దత్తాత్రేయ ఇప్పటి వరకూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి విలువైన సేవలు అందించారు. హరియాణా రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను ఆయన పోషిస్తారనే నమ్మకం ఉంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































