వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం నాడు ఈ సంవత్సరపు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం పంచముఖ రుద్ర మహాగణపతిగా గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మండపంలో ఈ విగ్రహానికి ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే ఈ సంవత్సరం 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. మరోవైపు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఇక సెప్టెంబర్ 19, ఆదివారం నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అన్ని కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలతో గణేశ్ ఉత్సవాలు జరపనున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ