మునుగోడు ఉపఎన్నిక: రేపే బంగారి గడ్డలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ

Munugode Bye-election CM KCR will Participate in Huge Public Meeting at Bangari Gadda Tomorrow, CM KCR Munugode Public Meeting, CM KCR Bangari Gadda Public Meeting, Telangana CM KCR, Mango News,Mango News Telugu, Munugode By-Election Latest News And Updates, Munugode By-Election, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, TRS Party, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు (అక్టోబర్ 30, ఆదివారం) చండూరు మండలంలోని బంగారి గడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ సభ వేదిక నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఓటర్లను సీఎం కోరనున్నారు. ఈ ఉపఎన్నిక ప్రచార పర్వం నవంబర్ 1 సాయంత్రం 6 గంటలకు ముగియనుండగా, ఓరోజు ముందుగా ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపనున్నారు.

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బంగారి గడ్డ వద్ద సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున ఈ బహిరంగ సభకు రానున్నారు. కాగా ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అధికార టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. పార్కింగ్ కోసం మండలాల వారీగా వేరు వేరుగా నాయకులు ఏర్పాట్లు చేశారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు సహా పలువురు నేతలు పర్యవేక్షించి, ఏర్పాట్లపై సూచనలు చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే కావడంతో టీఆర్ఎస్ నేతలు ఈ సభపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించించేలా ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు వ్యవహారం వెలుగులోకి రావడంపై ఆ అంశంపై సీఎం కేసీఆర్, ఏం మాట్లాడనున్నారు?, ఈ సభ సందర్భంగా ఏదైనా సంచలన విషయాలు బయటపెట్టబోతున్నారా? అనే చర్చ నడుస్తుండడంతో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ఇక ఆదివారం జరిగే సభలో సీఎం కేసీఆర్ మునుగోడుకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =