ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 19, సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరంలో క్షేత్రస్థాయిలో పనులు పురోగతి, పూర్తైన నిర్మాణాలను సీఎం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి సమావేశ మందిరంలో పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు. ముందుగా కాపర్ డ్యామ్ సహా క్షేత్ర స్థాయిలో ఇతర పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. 12 నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ



































