యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్

Active Telugu Film Producers Guild Decides to Stop Shootings from August 1st, Shootings Will Be Stopped from August 1st Says Active Telugu Film Producers Guild, Active Telugu Film Producers Guild, Movie Shootings To Be Halted From August 1st, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Latest News, Tollywood Film Producers, Film Producers, Telugu Film Producers, Telugu Movie Producers, Film Producers Chambers, Movie Shooting will Be Halt, Film Producers about Mmovie Shooting, Producer Dil Raju, Producers Concuil about Movie Releases in OTT, Movie Shootings, Telugu Movie Shootings, Movie Ticket Prices, Movie Producers Fix the Movie Ticket Prices For Big Budget Movies and Small Budget Movies, Telugu Film Industry Revenue, Tollywood Film Council Will Halt Movie Shooting From August 1st and Clear the Issues, Mango News, Mango News Telugu,

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్రస్తుతం నెల‌కొన్న క్లిష్ట ప‌రిస్థితుల‌ దృష్ట్యా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఏటీఎఫ్పీజీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది. వ్యవస్థాపకులు మరియు సభ్యులతో కలిసి 76 మంది నిర్మాతలు/నిర్మాణ సంస్థలు ఆగస్టు 1 నుండి షూటింగ్‌లను నిలిపివేయనున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

“కరోనా మహమ్మారి తర్వాత మారుతున్న ఆదాయ పరిస్థితులు మరియు పెరుగుతున్న ఖర్చులతో, నిర్మాతల సంఘంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించడం చాలా ముఖ్యం. మన ఎకో సిస్టమ్ ను మెరుగుపరచడం మరియు మన సినిమాలను ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదల చేస్తున్నామని నిర్ధారించుకోవడం మన బాధ్యత. ఈ విషయంలో, గిల్డ్‌లోని నిర్మాతలందరూ స్వచ్ఛందంగా ఆగస్ట్ 1, 2022 నుండి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు, మేము ఆచరణీయమైన తీర్మానాలను కనుగొనే వరకు చర్చల్లో పాల్గొంటాం” అని ప్రకటనలో తెలిపారు.

కరోనా పరిస్థితుల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో పలు మార్పులు రావడం, ఖర్చులు పెరగడం, ప్రేక్షకులు థియేటర్స్ కు మునుపటిలా రాకపోవడం, విడుదలైన కొద్ది కాలంలోనే ఓటీటీలలో సినిమాలు రావడంతో పడుతున్న ప్రభావం, అధిక టిక్కెట్ ధరలు, ఇలా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా పలు అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + one =