రాష్ట్రంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు (స్టాండ్ ఎలోన్ సినిమా థియేటర్స్) పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2018లో పార్కింగ్ ఫీజుల రద్దుకై జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ప్రేక్షకుల నుంచి వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని, మల్టీప్లెక్స్ లతో పాటుగా కమర్షియల్ కాంప్లెక్స్/మాల్స్‌లలో ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
సినిమా థియేటర్లలోని పార్కింగ్ ఏరియాల్లో సినిమాకి వచ్చిన ప్రేక్షకులే కాకుండా, ఇతరులు సైతం వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో వాహనాల నిర్వహణ, భద్రతా కష్టంగా మారిందని థియేటర్ల యాజమాన్యాల నుంచి విజ్ఞప్తులు రావడంతో, పరిశీలించిన అనంతరం సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలుకు అనుమతులు జారీ చేస్తున్నామని, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ