67 శాతం మందిలో యాంటీబాడీలు, ఐసీఎంఆర్‌ నేషనల్ సీరో సర్వేలో వెల్లడి

4th round of National Sero Survey conducted, 4th round of national serosurvey, 4th round of national serosurvey included children of 6-17, 4th sero survey finds 2 of 3 Indians with Covid antibodies, Fourth serosurvey finds 67.6% have antibodies, ICMR 4th Round, ICMR 4th Round National Sero-Survey, ICMR 4th Round National Sero-Survey : Overall Sero-Prevalence is 67.6 Percent in Entire Population, ICMR to start 4th national sero survey this month, Mango News, National Sero-Survey, Overall Sero-Prevalence is 67.6 Percent in Entire Population, Two-thirds of Indians exposed to Covid-19

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) నిర్వహించిన 4వ రౌండ్ దేశవ్యాప్త సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో దేశ జనాభాలో ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 67 శాతం మందిలో కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు తేలిందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వెల్లడించారు. జూన్‌-జులై మధ్యకాలంలో దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70జిల్లాల్లో నాలుగో సీరో సర్వే చేపట్టనట్టు తెలిపారు. ఇందులో మొత్తం 28,975 మంది పాల్గొనగా, 6-9 సంవత్సరాల వయసు వారు 2,892 (10%) మంది, 10-17 సంవత్సరాల వాళ్ళు 5,799 (20%), 18 సంవత్సరాలు పైబడినవారు 20,284 (70%) మంది ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే 7252 మంది హెల్త్ కేర్ వర్కర్లను పరీక్షించినట్టు తెలిపారు. జనాభాలో మూడింట రెండు వంతుల మందికి కరోనా యాంటీ బాడీలు ఉన్నప్పటికీ మరో 40 కోట్ల మందికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచివుందని చెప్పారు.

6-9 ఏళ్ల వయసున్న వారిలో 57.2 శాతం మందికి కరోనా‌ యాంటీబాడీలు ఉండగా, 10-17 వయసు వారిలో 61.6 శాతం, 18-44 వారిలో 66.7 శాతం, 45-60 ఏళ్ల వయసు వారిలో అత్యధికంగా 77.6 శాతం, 60 ఏళ్లు పైబడినవారిలో 76.7 శాతం మందిలో ఉన్నట్లు తెలిపారు. 4వ రౌండ్ నేషనల్ సీరో-సర్వే ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఆత్మసంతృప్తి చెందకూడదని బలరామ్ భార్గవ చెప్పారు. ప్రజల్లో కరోనా యాంటీబాడీలు లేని రాష్ట్రాలు/జిల్లాలు/ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ వేవ్స్ తలెత్తే అవకాశముంటుందని చెప్పారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయితేనే ప్రయాణాలకు మొగ్గుచూపాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fourteen =